ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే వ్యక్తి…ప్రణబ్

135
kavitha prashanth

‌త ర‌త్న‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల టీఆర్ఎస్ నేత‌, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణ వార్త ప‌ట్ల ఆమె ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ప్ర‌ణ‌బ్ నిజ‌మైన రాజ‌నీత‌జ్ఞుడు అని ఆమె అన్నారు. దేశం కోసం ఆయ‌న నిస్వార్థంగా సేవ చేశార‌న్నారు. ప్ర‌ణ‌బ్‌తో దిగిన ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో మాజీ ఎంపీ క‌విత ఈ సంద‌ర్భంగా షేర్ చేశారు. ప్ర‌ణ‌బ్ కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్న‌ట్లు క‌విత ట్వీట్ చేశారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం యావత్ భారతావనికి తీరని లోటని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ఆయన తీవ్ర సంతాపం ప్రకటించారు.తెలంగాణ ప్రజలు చిరకాలం గుర్తించుకునే వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని తెలంగాణ రాష్ట్ర కాంక్షకు ఆయన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.ఆయన చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూ పి ఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీ యే చైర్మన్ అని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని మంత్రి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

/twitter.com/RaoKavitha/status/1300414236955303938