బిపిన్ రావత్ సేవలు దేశం ఎన్నటికీ మరువదు: మోదీ

64
modi

తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్, జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సాయుధ దళాల సిబ్బందిని కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను అని తెలిపారు. భారతదేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేశారు..జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు అని కొనియాడారు.

నిజమైన దేశభక్తుడు, మన సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో రావత్ గొప్పగా దోహదపడ్డాడని తెలిపారు. వ్యూహాత్మక విషయాలపై రావత్ అవగాహన, దృక్పథాలు అసాధారణమైనవి….ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు.

భారతదేశపు మొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ బిపిన్ రావత్ రక్షణ సంస్కరణలతో సహా మన సాయుధ దళాలకు సంబంధించిన విభిన్న అంశాలపై పనిచేశారని…రావత్ ఆర్మీలో పనిచేసి గొప్ప అనుభవాన్ని తెచ్చుకున్నాన్నారు.