కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ..

25
kcr

మంత్రి కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అన్నారు చల్మాడ లక్ష్మీనరసింహరావు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఇవాళ మంత్రి కేటీఆర్, కేశవరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 50ఏళ్లలో చేయాల్సిన పనులు కేసీఆర్ ఐదేళ్లలో చేసి చూపించారన్నారు. తెలంగాణ చరిత్రలో ఫ్లోరెడ్ ఇక పోవడం అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి ఫ్లోరెడ్ రహిత రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. టీఆరెస్ లోకి రాజకీయ లబ్ధికోసం రావడం లేదు… కాంగ్రేస్ పార్టీకి నాయకత్వం లేదు- ఉన్న నేతల మధ్య సమన్వయం లేదన్నారు.

భావి తరాలు కేటీఆర్ నాయత్వంలో చాలా సేఫ్ గా ఉన్నారు…. తెలంగాణ రాష్ట్రానికి దశా- దిశ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. గంగులకు నాకు వ్యక్తిగత గొడవలు లేవు…ఎన్నికల్లో మాత్రమే ఇన్ని రోజులు మాకు పోటీ అన్నారు. ఎన్నికలు మినహాయిస్తే మేమంతా స్నేహితులమే అన్నారు.

తనకు నాకు లక్ష్మీ నరసింహ రావు అన్నకు ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి గంగుల. బయట వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నా అన్నారు. కరీంనగర్ నుంచి వచ్చి కొంతమంది శిఖండి రాజకీయం చేస్తున్నారు…. కేసీఆర్ దగ్గర శిఖండి రాజకీయం నడువదన్నారు.