డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి కరుణానిధి(94) కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయనకు అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. భారత దేశం ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆయన్ని కోల్పోయిందని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీటర్లో పేర్కొన్నారు.
ఇక కరుణానిధి మృతి చెందడంతో తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కరుణానిధి తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాక వయో భారం కారణంగా కరుణానిధి అవయవాలు చికిత్సకు స్పందించలేదు. ఆయన ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఇక కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానలు విషాదంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు.
My thoughts are with the family and the countless supporters of Karunanidhi Ji in this hour of grief. India and particularly Tamil Nadu will miss him immensely. May his soul rest in peace. pic.twitter.com/7ZZQi9VEkm
— Narendra Modi (@narendramodi) August 7, 2018