క‌ళ్యాణ్ సింగ్‌ భౌతిక‌దేహానికి పీఎం మోదీ నివాళి..

157
pm modi
- Advertisement -

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌ళ్యాణ్‌సింగ్ భౌతిక‌కాయానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. శ‌నివారం క‌ళ్యాణ్‌సింగ్ క‌న్నుమూశారు. ఆదివారం ఉద‌యం ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో ల‌క్నో వ‌చ్చిన మోదీ.. నేరుగా క‌ళ్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న పార్థివదేహానికి న‌మస్క‌రించిన నివాళి అర్పించారు. అనంతరం పీఎం మోదీ మీడియాతో మాట్లాడారు. తుదివరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవించిన వ్యక్తి కల్యాణ్ సింగ్ అని కీర్తించారు.

కల్యాణ్ సింగ్ విలువైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, ఎంతో సమర్థుడైన నేత అని కొనియాడారు. నమ్మకానికి ప్రతిరూపంగా సామాన్య ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని వెల్లడించారు. దేశం ఒక మంచి నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన లేని లోటును తీర్చాలంటే, ఆయన ఆదర్శాలు, హామీలను నెరవేర్చడమే మార్గమని అన్నారు. అందుకు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. “తల్లిదండ్రులు ఆయనకు కల్యాణ్ సింగ్ అని పేరుపెట్టారు. ఆ పేరును సార్థకం చేసుకుంటూ లోక కల్యాణం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. తన జీవితాన్ని బీజేపీ కోసం, భారతీయ జన్ సంఘ్ పరివారం కోసం అంకితమిచ్చారు” అని ప్రస్తుతించారు.

- Advertisement -