మరో మెగా అప్‌డేట్‌.. ఊర మాస్‌ లుక్‌లో చిరు..

34
chiru 154

ఆదివారం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రాల అప్‌డేట్‌లతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా మరో మెగా అప్‌డేట్‌ వచ్చేసింది. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించనున్న సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సముద్ర నేపథ్యంలో పూర్తి మాస్ స్టోరీతో తెరకెక్కనుందని తాజాగా రివీల్ చేసిన పోస్టర్ సూస్తే తెలుస్తోంది. చిరంజీవి పూర్తి మాస్ అవతారంతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు.

ఎర్రటి టవల్.. బీడీ తాగుతూ.. లుంగీ ధరించిన చిరంజీవి బోట్ పై నిలబడి కనిపిస్తున్నారు. సముద్రంలో లంగర్ వేసి దొంగతనాలు చేసే బంధిపోటునే తలపిస్తున్నాడు బాస్ ని చూస్తుంటే.. పోస్ట ర్ లో చిరు ఊర మాస్ గా కనిపిస్తున్నారు. జెండాలో చిరంజీవికి ఇష్టమైన దేవుడు- హనుమంతుని ఫోటో కనిపిస్తోంది. పోస్టర్ లో ఉదయించే సూర్యుడిగా చిరు కనిపిస్తున్నారు.

ఇక సముద్రంలోని బోట్ చుట్టూ కొందరు మాస్ కనిపిస్తున్నారు. వారు సముద్రంలో చేపలు పట్టడానికి వెళుతున్నారా.. ? లేక ఓడల్లో కరెన్సీని వేటాడుతారా? అన్నది అర్థం కావడం లేదు. ముఠా మేస్త్రి- ఘరానా మొగుడు- రౌడీ అల్లుడు తరహా లుక్ ఇది. నాటి రోజులను చిరంజీవి గుర్తుచేస్తున్నారు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. ‘‘త్వరలోనే చిరు 154 మొదలు కాబోతుంది. పూనకాలకు సిద్ధంగా ఉండండి’’ అని మైత్రీ సంస్థ ట్వీట్‌ చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంతో చిరంజీవి బిజీగా ఉన్నారు. కాగా, చిరు హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌గా మోహన్‌ రాజా రూపొందిస్తున్న చిత్రానికి ‘గాడ్‌ ఫాదర్‌’, తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘భోళా శంకర్‌’ అనే పేర్లు ఖరారైన విషయం తెలిసిందే.