సౌత్ రాష్ట్రలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోందా ? ప్రస్తుతం బీజేపీ పెద్దల దృష్టంతా దక్షిణాదిపైనే ఉందా ? అంటే ఔననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో స్థిరపదలని బీజేపీ కలలు కంటూనే ఉంది. కానీ ప్రాంతీయ భాషాభిమానం ఉన్న దక్షిణాది ప్రజలు బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కమలం పార్టీని కేవలం నార్త్ పార్టీ గానే చూస్తున్నారే తప్పా.. నేషనల్ పార్టీ గా చూడడం లేదు దక్షిణాది ప్రజలు. దాంతో ఎన్ని ప్రయత్నాలు చేసిన దక్షిణాదిలో మాత్రం సత్తా చాటడం లేదు బీజేపీ. ఇక పోతే మొన్నటి వరకు చెప్పుకోవడానికి కర్నాటక రాష్ట్రమైన ఉండేది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలతో అది కూడా లేకుండా పోయింది. .
దాంతో ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీని దక్షిణాదిలో బలపరిచేందుకు బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మరియు వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎలక్షన్స్ టార్గెట్ కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది. అలాగే ఏపీలో కూడా బలపడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ పెద్దలు కూడా ప్రస్తుతం ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలలోనే ఎక్కువ టైమ్ గడుపుతున్నారు.
Also Read:హ్యాపీ బర్త్ డే…ధోని
ఇక పోతే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడంతో దక్షిణాది రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సత్తా చాటడానికి కొత్త ఎత్తుగడలకు తెర తీస్తోంది కాషాయ పార్టీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సౌత్ నుంచి పోటీ చేస్తే.. పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మోడీని ఈసారి తమిళనాడు నుంచి రంగంలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. కుదిరితే కన్యాకుమారి లేదంటే కోయంబత్తూర్ నుంచి మోడీ బరిలో నిలుస్తారని జాతీయ మీడియా కొడై కుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని, ఇదే గనుక నిజం అయితే బీజేపీ ” మిషన్ సౌత్ ” ను గట్టిగానే ప్లాన్ చేస్తుందనే చెప్పాలి. మరి కమలం పార్టీ ఆశిస్తున్నట్లుగా సౌత్ లో కమలం వికసిస్తుందో లేదో చూడాలి.
Also Read:కుసుమ జగదీష్ కుటుంబానికి కోటిన్నర సాయం..