ప్ర‌భాస్ ఇలా ఎప్పుడూ లేడే

38
- Advertisement -

ప్ర‌స్తుతం నెట్టింట స‌లార్ టీజ‌ర్ మానియా న‌డుస్తుండ‌గానే ప్ర‌భాస్ త‌ర్వాతి సినిమా ప్రాజెక్ట్ కె కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. యూఎస్‌లో జ‌రిగే ప్ర‌ముఖ కామిన్ కాన్ ఈవెంట్‌లో ఈ సినిమాకు చోటు ద‌క్కంది అనేదే ఆ వార్త‌. కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రాజెక్ట్‌కె కి చోటు ద‌క్క‌డం అనేది ఇండియన్ సినిమాలోనే ఒక గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ విష‌యంపై ప్ర‌భాస్ లేటెస్ట్‌గా త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

కామిక్ కాన్‌లో ప్రాజెక్ట్ కె కు చోటు ద‌క్క‌డం త‌న‌కెంత ఎగ్జ‌యింట్‌గా ఉందో మాట‌ల్లో చెప్ప‌లేన‌ని, అక్క‌డే చూసుకుందామంటూ రాసుకొచ్చాడు. ప్ర‌భాస్ ఇంతలా ఏ సినిమాకూ ఎగ్జ‌యిట్ అవ‌లేదనే చెప్పాలి. మరోవైపు ప్రభాస్ నటించిన ‘సలార్’ టీజర్ వ్యూస్, లైక్ విషయంలో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ ఇప్పటివరకు 59 మిలియన్ వ్యూస్, 1.4మిలియన్ లైక్స్ అందుకుంది. కాగా, 24 గంటలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 5లిస్టులో 4 సినిమాలు ప్రభాస్‌వే ఉన్నాయి.

Also Read:కుసుమ జగదీష్ కుటుంబానికి కోటిన్నర సాయం..

101M+వ్యూస్‌తో ఆదిపురుష్ టాప్‌ ఉండగా, KGF2, సలార్, రాధేశ్యామ్, సాహో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అన్నట్టు స‌లార్ స్టోరీలైన్ ఇదేనంటూ నెట్టింట ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది. సున్న‌పురాయి మైనింగ్, ఫార్మా మాఫియా నేప‌థ్యంలో యూఎస్ ఆర్మీతో ఈ స్టోరీ క‌నెక్ట్ అయి ఉంటుంద‌ని తెలుస్తోంది. స్టోరీ లైన్‌లో కొన్ని అంశాలు కేజీఎఫ్-2కి లింక్ అయ్యేలా ఉంటాయ‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత అనేది తెలియాలంటే సినిమా వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Also Read:Harishrao:పేదల సంక్షేమమే లక్ష్యం

- Advertisement -