జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష నేతలతో ముగిసిన మోదీ సమావేశం..

164
PM Modi
- Advertisement -

జ‌మ్ముక‌శ్మీర్‌లోని అఖిలపక్ష నేతలతో జరిగిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మావేశం ముగిసింది. ఈ భేటీకి నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్​లోన్, గులాం నబీ ఆజాద్​, యూసుఫ్ తరిగామి సహా​ పలువురు నేతలు హాజరైయ్యారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం చేయడంపైనే ప్రధాన చర్చ జరిగింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ తెలిపారు.

డిడిసి ఎన్నికలు నిర్వహించినట్లే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని ప్రధాని అన్నారు. ఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు ప్రధాని. ఆయా పార్టీల నేతలు తమ అభిప్రాయాలను పంచుకోవడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్చల ద్వారా కాశ్మీర్‌కు మంచి భవిష్యత్తును నిర్మించడం జరుగుతుందని తెలిపారు

కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. 5 డిమాండ్లను సమావేశం దృష్టికి తీసుకువచ్చాం.రాష్ట్ర హోదా పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్ పండిట్ల పునరావాసం ఇతర అంశాలను లేవనెత్తాం. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా కల్పించాలి. నాయకులందరూ పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను భేటీలో డిమాండ్ చేశారు అని తెలిపరు.

అప్ని పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ మట్లాడుతూ.. ఈ రోజు చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి..అన్ని పార్టీల నేతల సమస్యలను ప్రధాని విన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయినప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాని చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియలో అందరూ పాల్గొనాలని కోరారు. ఎన్నికలకు ఇది రోడ్‌మ్యాప్ అని మాకు హామీ ఇచ్చారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారు అని అల్తాఫ్ బుఖారీ పేర్కొన్నారు.

- Advertisement -