శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐ ఫోన్లు పట్టివేత..

29
iphones

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐ ఫోన్లతో పాటు నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం దుబాయ్ ప్రయాణీకుల నుండి కోటి యాబై లక్షల రూపాయల విలువ చేసే ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్ నుండి ఇద్దరు కేటుగాళ్లు చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల కదలికలను చూసి ఈ కేడీలు.. దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన రెండు లగేజ్ బ్యాగ్ లను బెల్ట్ వద్ద వదిలి జారుకునే యత్నం చేశారు. అది గమనించిన అధికారులు ఇద్దరు ప్రయాణీకులను అరెస్టు చేసి.. లగేజ్ బ్యాగ్‌లో వున్న 50 ఐఫోన్లతో పాటు 4లక్షల నగదును సీజ్ చేశారు. వారిపై కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.