వడ్ నగర్ నుండి వారణాసి వరకు పయనిస్తున్న ‘సేవా సంకల్ప్ యాత్ర’ ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ (వర్చువల్గా)గా ముఖాముఖి నిర్వహించారు. వారి సేవా నిరతిని ప్రశంసిస్తూ, ఈ యాత్రికుల ప్రయత్నాలు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు.
నాకు వడ్ నగర్ జన్మభూమి అయితే కాశీ (వారణాసి) నా రెండవ కర్మభూమి. కాశీలో బాబా విశ్వనాథుడి ఆశీస్సులు, వడ్ నగర్లో హాటకేశ్వర్ మహాదేవుని ప్రేమానురాగాలు నాకు లభించాయి అని ప్రధాని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, ప్రయాణ ఇబ్బందులు ఉన్నప్పటికీ యాత్రికులు ఎంతో ఉత్సాహంతో ఈ సుదీర్ఘ సేవా ప్రచారాన్ని కొనసాగించడాన్ని ఆయన అభినందించారు. నిస్వార్థ సేవా భావంతో పనిచేసినప్పుడే ‘ఆయుష్మాన్ భారత్’ వంటి ప్రజా సంక్షేమ పథకాలు పురుడుపోసుకుంటాయని ప్రధాని తెలిపారు.
రాజకీయం, ఎన్నికలు, పాలన అనేవి వాటి స్థానంలో అవి ఉంటాయని, అయితే అందరి ప్రాథమిక లక్ష్యం దేశ నిర్మాణమే కావాలని నొక్కి చెప్పారు.2047 నాటికి ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని, నేటి యువత వికసిత భారత్కు వెన్నెముక లాంటి వారని మరియు భవిష్యత్ లబ్ధిదారులు కూడా వారేనని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
Also Read:వాము వాటర్ vs సోంఫ్ వాటర్?

