అస్సాంకు ప్రధాని మోదీ

3
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ … మార్చి 13 మరియు 14 తేదీలలో అసోం రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా టీ తోటల కార్మికులకు భూమి హక్కులను కల్పించే ల్యాండ్ పట్టాలు పంపిణీ చేయనున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

గువాహటి లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ప్రధాని రెండు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం మరియు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రధాని మొదట కోక్రాజార్ ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. అనంతరం గువాహటిలో నిర్వహించే కార్యక్రమంలో టీ తోటల కార్మికులకు భూమి యాజమాన్య హక్కుల పత్రాలు (ల్యాండ్ పట్టాలు) అందజేస్తారు. అసోంలో దాదాపు 200 సంవత్సరాలుగా టీ తోటల్లో పనిచేస్తున్న ఈ కార్మికులకు ఇప్పటివరకు భూమి హక్కులు లభించలేదని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటిసారిగా వారికి భూమి యాజమాన్య హక్కులు ఇవ్వడం ప్రారంభమవుతుందని చెప్పారు.

Also Read:సత్యవతిగా రీతు!

అదేవిధంగా మార్చి 14న ప్రధాని సిల్చార్‌లో సిల్చార్–షిల్లాంగ్–గువాహటి ఎక్స్‌ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.22,000 కోట్లు. అలాగే 150 మెగావాట్ల కోపిలి హైడ్రో పవర్ ప్రాజెక్టును కూడా దేశానికి అంకితం చేయనున్నారు. మొత్తం కలిసి దాదాపు రూ.32,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పర్యటనలో భాగంగా ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనలో కోక్రాజార్, గువాహటి, సిల్చార్ ప్రాంతాల్లో ప్రజా సభలను కూడా ప్రధాని మోదీ నిర్వహించనున్నారు.

- Advertisement -