ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అమెరికా దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే దాడుల తీవ్రతను 20 రెట్లు పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన మార్గంగా ఉన్న హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ చర్యలను అమెరికా జాగ్రత్తగా గమనిస్తోందని ఆయన తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే చమురు ట్యాంకర్ నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికన్ నేవీ ఎస్కార్ట్‌గా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇరాన్ నౌకాదళంపై అమెరికా ఇప్పటికే భారీ దాడులు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఆ దాడుల్లో ఇరాన్ నౌకాదళ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని, దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ప్రయత్నిస్తే ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read:వార్ ఎఫెక్ట్..యూరియాపై కూడా!

