వారణాసిలో మోడీ..నామినేషన్ దాఖలు

20
- Advertisement -

దేశ వ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఐదో దశ ఎన్నికల పోలింగ్ త్వరలో జరగనుండగా ఇవాళ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి మోదీ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

నామినేష‌న్ కంటే ముందు మోడీ.. గంగా న‌ది తీరంలో ఉన్న ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మూడ‌వ సారి మోడీ ప్ర‌ధాని కావాల‌ని, దేశ ప్ర‌ఖ్యాత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెలిగిపోవాల‌ని కోరుకున్న‌ట్లు పూజారి రామ‌ణ్ వెల్ల‌డించారు. ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక క్రూయిజ్ బోట్‌లో విహ‌రించారు.

Also Read:‘పదహస్తసనం’తో ఆ సమస్యలు దూరం!

- Advertisement -