అస్సాంలో హ్యాట్రిక్ కొడతాం:మోదీ

8
- Advertisement -

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అస్సాంలోని గోగాముఖ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ, గత పదేళ్లలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని మోదీ అన్నారు. ప్రజలు మళ్లీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికు మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

“ఈసారి ఎన్నికలు ‘వికసిత భారత్’ నిర్మాణానికి కీలకం. అస్సాంలో మూడోసారి కూడా NDA ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది” అని మోదీ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్‌ను తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. NDAకి హ్యాట్రిక్ విజయమొస్తుందని, కాంగ్రెస్‌కు పరాజయాల హ్యాట్రిక్ ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.

సభకు భారీగా ప్రజలు హాజరుకావడం NDAకు మద్దతు ఉన్నదనే సంకేతమని మోదీ అన్నారు. తాను కూడా ప్రధానిగా హ్యాట్రిక్ సాధించినట్లు గుర్తుచేసుకుని, అస్సాంలో కూడా అదే ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను మోదీ వివరించారు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా 15 లక్షల కుటుంబాలకు ఇళ్లు,ఇంకా ఇల్లు పొందని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు,పేద కుటుంబాలకు KG నుంచి PG వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు.

Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

- Advertisement -