ఆరోగ్యకరమైన డెజర్ట్‌లు రుచి, టెక్స్చర్‌లో తగ్గిపోతాయని అనుకునే వారికి కొత్త ప్రత్యామ్నాయం వచ్చింది. ‘కలా చనా ప్రోటీన్ బ్రౌనీస్’ అనే ప్రత్యేకమైన రెసిపీని అందుబాటులోకి తెచ్చారు. ఈ బ్రౌనీస్ ప్రత్యేకత ఏమిటంటే — వీటిలో ప్రధానంగా ఉపయోగించే పదార్థం కలా చనా (బ్లాక్ చిక్పీస్). ఇది బ్రౌనీస్‌కు మంచి టెక్స్చర్ ఇవ్వడమే కాకుండా, అధిక ప్రోటీన్ మరియు ఫైబర్‌ను అందిస్తుంది.
ఈ బ్రౌనీస్‌లో కలా చనా ఉందని అసలు రుచి ద్వారా గుర్తించలేరు. ఇవి పూర్తిగా రిచ్, గూయీ టెక్స్చర్‌తో సాధారణ బ్రౌనీస్‌లానే ఉంటాయి.ఈ రెసిపీ ప్రధాన ఆకర్షణ — ప్రతి సర్వింగ్‌లో సుమారు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.అదనంగా, కలా చనా వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
() అవసరమైన పదార్థాలు
1½ కప్పులు మిల్క్ చాక్లెట్
ప్రోటీన్ పౌడర్
¾ కప్పు మోంక్ ఫ్రూట్ స్వీటెనర్
½ కప్పు + 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్
1 కప్పు నాన్-డైరీ పాలు
1 కప్పు మామిడి/అరటి/ఆపిల్ ప్యూరీ
1 టీస్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్
2 ఫ్లాక్స్ ఎగ్స్ (2 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ + 6 టేబుల్ స్పూన్లు నీరు)
3 కప్పులు ఉడికించి చల్లార్చిన కలా చనా
1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్
()తయారీ విధానం
పై పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని 9×13 అంగుళాల ట్రేలో పోయాలి.
పైగా చాక్లెట్ ముక్కలు చల్లి ఓవెన్‌లో పెట్టాలి.
175°C వద్ద 30–45 నిమిషాలు బేక్ చేయాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.
Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!
()ఆరోగ్య ప్రయోజనాలు
అధిక ప్రోటీన్ (24g ప్రతి సర్వింగ్)
ఫైబర్ సమృద్ధిగా ఉండటం
జీర్ణక్రియకు సహాయం
ప్లాంట్-బేస్డ్, వెగన్ ఫ్రెండ్లీ
తీపి తినాలనిపించినప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారికి ఈ ‘కలా చనా ప్రోటీన్ బ్రౌనీస్’ అద్భుతమైన ఎంపిక.

