దేశంలో తుదిదశలో కరోనా వ్యాక్సిన్‌: మోడీ

202
modi
- Advertisement -

కరోనా పై పోరులో విజయం సాధిస్తామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోడీ….జాతీనుద్దేశించి ప్రసంగించారు.

దేశంలో మూడు ర‌కాల క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్ ద‌శ‌ల్లో ఉన్నాయని…. ఆ టీకాల‌ను ప్ర‌తి ఒక భార‌తీయుడికి అందే విధంగా కార్యాచ‌ర‌ణ రూపొందించామన్నారు.

జాతీయ డిజిట‌ల్ హెల్త్ మిష‌న్‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామని…ప్ర‌తి ఒక భార‌తీయుడికి హెల్త్ ఐడీ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. హెల్త్ ఐడీలు ఇవ్వడం ద్వారా ప్ర‌తిసారి డాక్ట‌ర్‌ను కానీ ఫార్మ‌సీని కానీ విజిట్ చేస్తే, దాంట్లో మీ హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఉంటుంద‌న్నారు.

నూతన విధానంలో జాతీయ పరిశోధన నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన మోడీ…..దేశం ముందుకు సాగేందుకు నూతన ఆవిష్కరణలు అవసరమని, నవ కల్పనలు నిరంతరం సాగాలన్నారు.

బ్యాంకు ఖాతాలు, రేషన్‌పంపిణీ, నగదు బదిలీ చేపట్టామని, ఒకే కార్డు ఒకే దేశం వంటి పథకాలు తీసుకువచ్చామని తెలిపారు. కృష్టకాలంలో ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు చేరాయని, ఉచిత గ్యాస్‌, ఆహార ధాన్యాల పంపిణీ 80 కోట్ల మంది ఆకలిని దూరం చేశాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీటి కోసం నిరంతరం ప్రయత్నం సాగుతోందన్నారు. జలజీవన్‌మిషన్‌తో ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుంది ప్రధాని అన్నారు.

- Advertisement -