ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాటికి దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా పనిచేసిన ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ సారథిగా ఆయన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ కాలంలోనే భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.కొత్త ప్రాంతాలకు విస్తరించింది మరియు అనేక వర్గాల మద్దతును పొందింది.
ఈ 12 ఏళ్ల ప్రయాణం నమ్మకం, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమానికి అంకితం చేయబడిందని ప్రధానమంత్రి అన్నారు. 140 కోట్ల మంది తోటి పౌరుల ఆశీస్సులు, ‘దేశమే సర్వోపరి’ అనే భావనతో మన యువత, మహిళలు, రైతు సోదర సోదరీమణుల సాధికారత కోసం మేము ఎలాంటి శ్రమను దాచుకోలేదు. ఈ అవిరళ కృషి ఫలితంగానే నేడు మౌలిక సదుపాయాల నుండి డిజిటల్ విప్లవం వరకు దేశం ప్రపంచ వేదికపై ఒక కొత్త గుర్తింపును పొందింది పేర్కొన్నారు.
బుధవారంతో ప్రధానిగా మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మొదట 1947 లో బాధ్యతలు స్వీకరించి 1951-52 లో దేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో విజయం సాధించి, 1964 లో తన మరణం వరకు పదవిలో కొనసాగారు. భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ దాదాపు 16 సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు కానీ ఆమె రెండు వేర్వేరు దఫాలుగా పనిచేశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం జరిగే సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఒక తీర్మానాన్ని ఆమోదించనుంది. 72 మంది ఎన్డీయే నాయకులు హాజరయ్యే ఈ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు. మే 26, 2014 న మోదీ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తిరిగి 2019 లో భారీ మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు . 2024 లో మూడవసారి ప్రధాని అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ప్రధానికి అభినందనలు తెలిపారు.
Also Read:రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేశా!

