భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన కథాంశాలు, సహజత్వంతో కూడిన గ్రామీణ నేపథ్య చిత్రాలతో సినీ జగత్తుపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
1977 లో తమిళంలో వచ్చిన ‘16 వయథినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలి చిత్రంతోనే అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను అవుట్‌డోర్‌కు… పల్లెటూరి వాతావరణానికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. సినిమా మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ ఎందరో నటీనటులను, సాంకేతిక నిపుణులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు.
Also Read:GIC:సుందర్‌బన్‌లో హరిత వికాసం
ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ఆరాధన , జమదగ్ని వంటి వైవిధ్యమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘యువ’, ధనుష్ నటించిన ‘తిరు’, ఇటీవల విడుదలైన విజయ్ సేతుపతి మైలురాయి చిత్రం ‘మహారాజా’ వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకున్నాయి.భారతీరాజా మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ పెద్దలు పేర్కొన్నారు. ఒక గొప్ప మార్గదర్శకుడిని, సినీ దార్శనికుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

