ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూ చండీగఢ్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 23 ఏళ్ల యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6/33 అద్భుత గణాంకాలతో రాణించాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ…భారత్ తరఫున టెస్ట్ క్యాప్ అందుకున్నప్పటి తన భావోద్వేగం….పిచ్‌పై తన బౌలింగ్ ప్రణాళికలు, ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల్లోనే వైట్-బాల్ క్రికెట్ నుండి రెడ్-బాల్ క్రికెట్‌కు మారడంలో ఎదురైన సవాళ్ల గురించి పంచుకున్నాడు.
గౌతమ్ సర్ ,కెప్టెన్ ఇద్దరూ వచ్చి నేను ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు చెప్పారు. అది నాకు ఎంతో గర్వకారణమైన క్షణం. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి.. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలనేది నా కల, నా తండ్రి కల మరియు ప్రతి ఒక్కరి కల. నేను అండర్-19 ఆడినా, రంజీ ట్రోఫీ ఆడినా.. అంతిమ లక్ష్యం మాత్రం ఇండియాకు ఆడటమే. ఈ క్రీడలో టెస్ట్ క్రికెట్ అనేది అన్నింటికంటే అత్యున్నతమైనది. నాకు క్యాప్ ప్రెజెంట్ చేస్తూ కుల్దీప్ భాయ్ (కుల్దీప్ యాదవ్) ఇచ్చిన స్పీచ్ నన్ను ఎంతగానో ఉత్తేజపరిచింది. జట్టులోని ప్రతి ఒక్కరూ నన్ను చాలా ప్రోత్సహించారు అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని బంతులు టర్న్ అవ్వడం గమనించాను. అలాగే నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని బంతులు పిచ్‌పై ఆగుతూ వచ్చాయి. దాంతో ఈ పిచ్‌పై స్పిన్నర్లకు ఖచ్చితంగా సహాయం లభిస్తుందని నాకు అర్థమైంది. నేను నా మొదటి ఓవర్ వేయగానే బంతి టర్న్ అయ్యింది. అందుకే ఈ వికెట్‌పై నా రెగ్యులర్ స్టాక్ బాల్స్ వీలైనంత ఎక్కువగా వేయడానికి ప్రయత్నించాను. అతిగా ప్రయత్నించి పరుగులు ఇవ్వకూడదనుకున్నాను కేవలం బంతిని సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయడంపైనే దృష్టి పెట్టాను. నేను కెరీర్ ప్రారంభం నుండి స్పాట్-బౌలింగ్ పైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టాను…ఈ రోజు నాకున్న కన్సిస్టెన్సీకి అదే కారణం. నా 6 వికెట్లలో మొదటి వికెట్ నాకెప్పటికీ ఫేవరెట్. అక్కడ బ్యాటర్‌తో మంచి పోటీ నడిచింది కాబట్టి నా ఫోకస్ అంతా ఒకే చోట స్థిరంగా బౌలింగ్ చేయడంపైనే ఉంచాను అని చెప్పుకొచ్చాడు.
Also Read:టీఎంసీపై అధిర్ రంజన్ ఫైర్
భారత జట్టులోకి నా పేరు పరిశీలనలో ఉందనే విషయం నాకు ముందే తెలుసు. అందుకే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో కూడా నేను ఖాళీ సమయాల్లో రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ అవకాశం వస్తే ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై మానసికంగా సిద్ధమయ్యాను. ..అదే తన సక్సెస్‌కి కారణమైందన్నాడు మానవ్ సుతార్.

