అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్ 3 మిషన్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగిపోయింది.
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సరికొత్త చరిత్ర సృష్టించాం అని ది నవ భారత విజయం అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇది నవశకం అని… అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాం అన్నారు. చంద్రుని నుండి కూడా ముందుకు పోతాం అన్నారు. త్వరలోనే సూర్యుని పై అధ్యయనానికి ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ ఆదిత్య త్వరలోనే ప్రారంభించనున్నారని చెప్పారు.
చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. ఒక ఓవరాల్గా చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ నిలవగా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంలో నిలిచింది.
Also Read:Chandrayaan 3:జయహో ఇస్రో