డేటింగ్ యాప్స్ వాడుతూతున్నారా..జర భద్రం!

25
- Advertisement -

నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో కొత్త పరిచయాలను పెంచుకోవడం చాలా తేలిక అయింది. నిన్న మొన్నటి వరకు ఫెస్బుక్, మెసెంజర్, స్నాప్ చాట్ వంటి వాటితో కొత్తవారితో పరిచయాలు పెంచుకునే వారు ఇప్పుడు అలా పరిచయాలు ఏర్పరచుకోవడానికి ఇంస్టాగ్రామ్ వేధికైంది. అయితే ఇంస్టాగ్రామ్ కంటే ఎక్కువగా ఇప్పుడు డేటింగ్ యాప్స్ కు యువత ఎక్కువగా ఆకర్షితమౌతోంది. దీనికి కారణం కొత్త వ్యక్తితో డైరెక్ట్ గా చాట్ చేయడం లేదా వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దానికి తోడు నచ్చిన వ్యక్తితో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునేందుకు డేటింగ్ యాప్స్ మంచి సోర్స్ గా ఉన్నాయి. .

దీంతో రోజు రోజుకు డేటింగ్ యాప్స్ వాడకం పెరుగుతోంది. అయితే ఈ డేటింగ్ యాప్స్ పట్ల ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్త వహించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. డేటింగ్ యాప్స్ లో వ్యక్తిగత ఫోటోస్, బ్యాంక్ వివరాలు వంటివి షేర్ చేయడం అసలు మంచిది కాదట. ఈ మద్య ఆన్లైన్ మోసాలన్నీ డేటింగ్ యాప్స్ నుంచే ఎక్కువగా జరుగుతున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంకా డేటింగ్ యాప్స్ లో పరిచయం అయిన వ్యక్తిలను తేలికగా నమ్మేయడం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు.

ఎందుకంటే రకరకాల మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతుంటారని అందువల్ల వారి ఉద్దేశ్యం ఎలాంటిదో తెలుసుకోకుండా అవతలి వ్యక్తులను వెంటనే నమ్మేయడం వంటివి చేయకూడదట. అన్నిటి కంటే ముఖ్యం ఈ డేటింగ్ యాప్స్ లోని పరిచయాలను సీరియస్ గా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డేటింగ్ యాప్స్ లోని పరిచయాలను సీరియస్ గా తీసుకొని జీవితాలను నాశనం చేసుకున్నవారు చాలమందే ఉన్నారు. కాబట్టి ఈ ఆన్లైన్ యుగంలో అన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:ఏపీలో కూడా బండి తీరు మారలే!

- Advertisement -