కరోనా విషయంలో ప్రభుత్వం సూచనలు పాటించండి

272
ktr
- Advertisement -

కరోనా విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సూచనలు పౌరులు పాటించాలని కోరారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించానలి పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, వ్యక్తిగత నియమాలను పౌరులు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు.

కరోనా విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న దేశాలు హాంకాంగ్, సింగపూరర్, జపాల్ లు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయని కానీ ఇతర ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో కంట్రోల్ కావడం లేదని తెలిపారు. మనం కూడా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చని తెలిపారు.

- Advertisement -