తెలంగాణలో 24గంటలు జనతా కర్ఫ్యూః సీఎం కేసీఆర్

421
cm kcr
- Advertisement -

రేపు ఉదయం 6గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6గంటల వరకు జనతా కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విషయంలో యావత్ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పాలు, మందులు, ఆంబులెన్స్, కూరగాయలు, మెడికల్ షాపులు మాత్రం తెరచి ఉంటాయి..మిగతా అన్ని షాపులు, మాల్ లు మూసివేయాలని కోరారు. అత్యవసర సేవలు మాత్రమే రేపు పనిచేస్తాయని తెలిపారు. కరోనా వైరస్ విషయంలో మనం కొంచెం ముందుగానే అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినం అన్నారు . ఇందులో మనకు ఉన్న ప్రమాదం ఎంటి అంటే విదేశాల నుంచి వచ్చే వారివల్లనే ఈ వ్యాధి సోకుతుంది.

మార్చి 1 నుంచి ఇప్పటివరకు 20వేల పైచిలుకు మంది వచ్చారు. వీళ్లలో కొంత మంది హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగినవారు కావచ్చు మిగతా రాష్ట్రాల్లో దిగి హైదరాబాద్ కు వచ్చినవారు ఉన్నారు. కరీంనగర్ సంఘటన తర్వాత కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. హైదరాబాద్ ఎయిర్ పోర్టునుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ చేస్తున్నాం.. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి గురించి తెలియడం లేదన్నారు. రేపు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరగదు..అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను కూడా రాష్ట్రంలోని రానివ్వమని తెలిపారు.

అలాగే హైదరాబాద్ లో మెట్రో రైళ్లను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా అనుమానితులపై నిఘా కోసం తెలంగాణ చుట్టూ 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 11 వేల మంది అనుమానితులను గుర్తించి వారిని పరిశీలిస్తున్నామని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సరిగా తెలియడంలేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చేవారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రేపు రాష్ట్రం నలుములలా సాయంత్రం 5 గంటలకు సైరన్ వచ్చేటట్లు చేశాం ఆ టైం లో అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పారు.

- Advertisement -