మొక్కలు నాటిన ప్లే బాయ్ చిత్రయూనిట్…

260
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బాయ్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వెంకటగిరి కాలనీ పార్క్ లో మొక్కలు నాటిన ప్లే బ్యాక్ సినిమా యూనిట్ సభ్యులు హీరోయిన్ స్పందన; హీరో దినేష్ తేజ ;అర్జున్ కళ్యాణ్; సీనియర్ జర్నలిస్టు మూర్తి(TV5) టిఎన్ఆర్(IDremms) అశోక్ వర్ధన్; జక్క హరిప్రసాద్.

ఈ సందర్భంగా జర్నలిస్టు మూర్తి TV5 మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా విజయవంతమైందని. హరితహారం స్ఫూర్తితో గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని నాకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం బాగా ఆకట్టుకుందని. ఇప్పటికే మనం నీరు కోనుకుంటున్నామని భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే ఈ పరిస్థితి రాకూడదని భవిష్యత్ తరాలకు మనము ఇచ్చేది ఒకటే మంచి వాతావరణాన్ని అందించడం. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

నేను కూడా ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే సమయంలో తప్పకుండా నేను నాటిన మొక్క రక్షించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ప్లే బ్యాక్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేను కూడా ఈ సినిమా లో నటించాను కాబట్టి మా సినిమా సభ్యులతో కలిసి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. మా టిం సభ్యులందరం కూడా ప్రతి ఒక్కరము మా మిత్రులకు ఈ చాలెంజ్ ను ఇచ్చి మొక్కలు నాటించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -