కరోనా నివారణపై దృష్టిసారించాలి: పీకే మిశ్రా

193
PK Mishra

కరోనా వ్యాప్తి,నియంత్రణపై ఈ రోజు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోన మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సంసిద్ధత, ప్రతిస్పందనపై సమీక్షించారు. అలాగే జిల్లాలు, రాష్ట్రాలలో కరోనా కేసుల ఆధారంగా నివారణపై దృష్టిసారించాలని ఆధికారులతో చర్చించారు. కొవిడ్ టీకా అభివృద్ధి దశ, వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళికపై అధికారులు చర్చించారు.

కరోన చికిత్సలో భాగంగా మానవవనరులను పెంచుకోవడం, కాంటాక్ట్ ట్రేసింగ్, నిరంతర ఆక్సీజన్ సరఫరా, వైద్య పరికరాలతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. గడచిన కొన్ని నెలల నుండి సేకరించిన వివరాలు, జరిపిన విశ్లేషణ ఆధారంగా రాబోయే రోజులకు ప్రణాళిక రూపొందించాలని పీకే మిశ్రా అధికారులను ఆదేశించారు.