చాలా మందికి పండ్ల రసాలు సేవించడం ఎంతో ఇష్టం. కొందరైతే భోజనానికి ముందు లేదా భోజనం తరువాత కచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తప్పనిసరిగా సేవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆపిల్ జ్యూస్, లెమెన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, బనానా జ్యూస్, ఫైనాఫిల్ జ్యూస్… ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగే ఉంటుంది. అయితే ఇలా పండ్ల రసాలు సేవించడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ యొక్క జ్యూస్ లను సేవించడం వల్ల ప్రయోజనలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాఫిల్ జ్యూస్ తాగడం వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఈ జ్యూస్ అధికంగా సేవిస్తే నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫైనాఫిల్ ను అనాస పండు అని కూడా అంటారు. ఇది రుచికి పులుపు తీపి కలగలిపి ఉంటుంది. అంతే కాకుండా కాస్త ఒగరుగాను ఉంటుంది..
ఈ ఫైనాఫిల్ పండు గాని లేదా జ్యూస్ గాని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ బయోటిక్ గుణాల కారణంగా రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఫైనాఫిల్ జ్యూస్ లో ఉండే బ్రోమేలైన్ అనే ఎంజైమ్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఫైనాఫిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అధ్యయనలు చెబుతున్నాయి. అయితే ఫైనాఫిల్ జ్యూస్ మితంగా తీసుకుంటే ఒకే గాని.. ఎక్కువగా ఈ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయి. ఫైనాఫిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువైతే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనాఫిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.. ఇది ఎక్కువైతే అతిసార వ్యాధికి దారితీస్తుంది. ఇంక ఫైనాఫిల్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే బద్దకం, బలహీనత, వికారం వంటి సమస్యలు కూడా రావోచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఫైనాఫిల్ జ్యూస్ ను ఎంత మితంగా తీసుకుంటే అంత మేలు.