- Advertisement -
కేరళ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు పినరయి విజయన్. ఈ నెల 20న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా..కరోనా నేపథ్యంలో కేవలం 500 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
విజయన్‌తో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్‌తో ప్రమాణం చేయించనుండగా 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళ చరిత్రలోనే రికార్డును తిరగరాస్తూ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వామపక్ష కూటమి 99 సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది.
- Advertisement -