మరోసారి మంచిమనసు చాటుకున్న కేటీఆర్..

47
ktr

మంత్రి కేటీఆర్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటున్న కేటీఆర్…తాజాగా ఓ గిరిజన కుటుంబానికి అండగా నిలిచారు.

ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని హత్తిగుట్ట గిరిజన గ్రామానికి చెందిన టేకం భీంరావు, సంగీతాబాయి దంపతుల కుమార్తే కరిష్మా (2) పుట్టుక నుంచి కాళ్లు, చేతులు పని చేయడం లేదు. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. పాప తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఈ విషయాన్ని గమనించిన నిర్ణయ్‌ ఫర్‌ ఆదిలాబాద్‌ స్వచ్ఛంద సంస్థ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో చిన్నారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ చికిత్స, అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కేటీఆర్ తన చిన్నారిని ఆదుకునేందుకు ముందురావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.