8 నుండి కేరళలో లాక్ డౌన్…

91
vijayan

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతుండగా పలు దేశాలు లాక్ డౌన్ బాటపట్టగా తాజాగా కేరళ కూడా చేరింది. మే 8 తేదీ నుంచి 16 వరకు కేరళ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయన్ తెలిపారు.

మే 8న ఉదయం 6 గంటల నుంచి 16 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని..అత్యవసర సేవలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.