కేర‌ళ ముఖ్య‌మంత్రిగా విజ‌య‌న్ ప్ర‌మాణం..

42
kerala cm oath

కేర‌ళ ముఖ్య‌మంత్రిగా పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. విజ‌య‌న్ సీఎంగా ప్ర‌మాణం చేయ‌డం వ‌రుస‌గా ఇది రెండోసారి. విజ‌య‌న్ చేత గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ‌మ్మ‌ద్ ఖాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. సీఎంతో పాటు 21 మంది మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. తిరువ‌నంత‌పురంలోని సెంట్ర‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సీపీఐ(ఎం) నాయ‌కుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక కేబినెట్‌లో చేరిన వారంతా అంద‌రూ కొత్త‌వారే. ఈ సంద‌ర్భంగా సీఎం విజ‌యన్‌తో పాటు మంత్రుల‌కు గ‌వ‌ర్న‌ర్, ఇత‌ర ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.