ఫోన్ ట్యాపింగ్ రచ్చ.. జగన్‌కు దేబ్బే!

54
- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినప్పటికి ఏపీ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది ముఖ్యంగా అధికార వైసీపీపై సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు ఎదురవుతోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్న వైఎస్ జగన్ కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయమనే చెప్పుకోవాలి. ఆ మద్య వైసీపీ సీనియర్ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి పార్టీ పైన అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పార్టీ అధిష్టానం కూడా ఆనంపై గట్టిగానే వేటు వేసింది. ఇక తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పార్టీపై తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు..

తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఇలా ట్యాపింగ్ చేయడం జగన్ కు తెలియకుండా జరుగుతుందా అంటూ సొంత పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా తనెప్పుడు పని చేయలేదని, వైఎస్ఆర్ కు జగన్ కు తనెప్పుడు విధేయుడిగానే ఉన్నానని.. అయినప్పటికి ఇలా ట్యాపింగ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలో తగిన ప్రదాన్యత ఇవ్వకపోయిన పార్టీ కొరకు పని చేశానని చెప్పుకొచ్చారు. అయినప్పటికి పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని, ఇన్ని అవమానాల మద్య పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కోటంరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే హాట్ టాపిక్ అనుకుంటే మరో 35 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు నలుగురి ఎంపీలు, ఇద్దరు మంత్రుల ఫోన్ లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పి ఒక్కసారిగా బాంబ్ పేల్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తన ప్రశ్నలకు వైసీపీ నుంచి ఎవరు సమాధానం చెబుతారో చెప్పాలని సవాల్ విసిరారు.

దీంతో ఏపీలోని ఈ ఫోన్ ట్యాపింగ్ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా పార్టీపై దిక్కార స్వరం వినిపిస్తున్న నేతలంతా వైసీపీకి గుడ్ బై చెబుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ విడుతున్నట్లు ప్రకటించారు. ఇక ఈయన దారిలోనే ఆనం నారాయణరెడ్డి కూడా వైసీపీకి టాటా చెబుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరితోపాటుగా మరికొంత మంది ఎమ్మేల్యేలు కూడా వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారట. దీంతో వీళ్ళంతా పక్కా పార్టీలపై చూసే అవకాశం ఉంది. మొత్తానికి ఊహించని రీతిలో ఎన్నికల ముందు సొంత పార్టీ నుంచే తిరుగుబాటు గళం వినిపిస్తుండడంతో ఈ వ్యవహారం అంతా కూడా వైఎస్ జగన్ కు గట్టి దేబ్బే అని చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -