నేడు ఐదో దశ పోలింగ్..

265
Lok Sabha Elections 2019
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో 373 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. చివరి మూడు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సోమవారం ఐదో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Lok Sabha Elections 2019

అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో 7, మధ్యప్రదేశ్ లో 7, బీహార్ లో 5, ఝార్ఖండ్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 2 స్థానాలకు పోలింగ్ నిర్వహింస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రముఖులు బరిలో ఉండడంతో పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. నేటి పోలింగ్‌తో కలపుకుంటే దేశంలోని 424 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. మిగిలిన 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది.

- Advertisement -