త్వరలో భారత్‌లో ఫైజర్‌ టీకా!

117
pfizer
- Advertisement -

కరోనా పోరులో ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. అతి త్వరలోనే భారత్‌లోకి ఫైజర్‌ టీకా రానుంది. అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు ఆ సంస్థ సీఈవో ఆల్బర్ట్‌ బౌర్లా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని చెప్పారు.

భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. దీంతో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది.

ఇక దేశంలో 24 గంట‌ల్లో 50,848 క‌రోనా కేసులు న‌మోదుకాగా 1358 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లు దాటగా 2,89,94,855 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

- Advertisement -