స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు..

222
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రోజువారి సమీక్షలో భాగంగా చమురు కంపెనీలు పెట్రోల్‌ లీటర్‌పై 18 పైసలు తగ్గించాయి. సవరించిన ధరలతో పెట్రోల్‌ లీటర్‌ రూ.90.99కు చేరింది. అలాగే డీజిల్‌ లీటర్‌కు 17 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ.81.30 చేరింది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.61, డీజిల్‌ రూ.88.67కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.97.40, డీజిల్‌ రూ.88.42, చెన్నైలో పెట్రోల్ రూ.92.95, డీజిల్‌ రూ.86.29, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.18, డీజిల్‌ రూ.84.14గా ఉన్నాయి. వరుసగా 24 రోజుల పాటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి.

- Advertisement -