సీఎం సహాయ నిధికి పెరిక సంఘం భారీ విరాళం..

334
minister ktr
- Advertisement -

కరోణ వైరస్ బాధితుల సహాయార్థం ఈరోజు సోమవారం 07-06-2020 రోజున రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్టంలోనే కుల సంఘం తరఫున మొదటిసారిగా కరోనా సహయనిధికి విరాళముగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం తరపున 10,00,116/- పది లక్షల నూట పదహారు రూపాయలను చెక్కును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ , ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు మద్దాలి లింగయ్య , ప్రధాన కార్యదర్శి లక్కరసు ప్రభాకర్ వర్మ , గౌరవ అధ్యక్షులు చుంచు ఉషన్న, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ , పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు శ్రీ రామ్ దయానంద్ పాల్గొన్నారు

- Advertisement -