దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్‌గా ప్రస్తుతం ”పెళ్లి సందD” తెరకెక్కుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ .. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. గౌరీ రోణంకి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో కథానాయికగా శ్రీలీల తెలుగు తెరకి పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘పట్టుచీరల తళతళలు .. పట్టగొలుసులా గలగలలు’ అంటూ ఈ పాట సాగుతోంది. పెళ్లి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉండగా, బంధుమిత్రుల సమక్షంలో నాయకా నాయికలు చేసే సందడినే ఈ పాట. ఈ పాటను చంద్రబోస్ రాయగా… కీరవాణి సంగీతాన్ని అందించారు, హేమచంద్ర .. దీపు .. రమ్యబెహ్రా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు.