నటనకు గుడ్‌బై చెప్పేస్తానంటున్న కాజల్‌..!

136
Kajal Aggarwal

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ చందమామ గత యేడాది ముంబైకు చెందిన గౌతమ్‌ కీచ్లు అనే పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది. అయితే కాజల్‌ తాజాగా ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే.. తన భర్త కోరిన మరుక్షణం సినిమాల్లో నటించడం మానేస్తానంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కాజల్‌ సమాధానమిస్తూ, ‘నేను ఎంతకాలం సినీ రంగంలో కొనసాగుతానో నాకు తెలియదు. నా భర్త సినీ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన మరుక్షణమే నటనకు గుడ్‌బై చెప్పేస్తాను. నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను’.. అని కాజల్‌ అగర్వాల్‌ తెలిపింది.

కాగా, కాజల్‌ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ పూర్తి చేసిన కాజల్ ప్రస్తుతం అక్కినేని నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం విశ్వనటుడు కమల్‌తో ‘ఇండియన్ 2’లో నటిస్తోంది.