వివాదంలో ‘పెళ్లిసందD’ హీరోయిన్..

306
- Advertisement -

పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలీల తన కుమార్తె కాదని వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు స్పష్టం చేశారు. శ్రీలీల తన మాజీ భార్య కుమార్తె అని వెల్లడించారు. తాము విడిపోయిన తర్వాతే శ్రీలీల జన్మించిందని తెలిపారు. మాజీ భార్య నుంచి తాను విడిపోయి 20 ఏళ్లు అవుతోందని అన్నారు.

అయితే తన నుంచి ఆస్తులను రాబట్టేందుకు తన పేరు చెప్పుకుంటున్నారని శుభాకరరావు ఆరోపించారు. తన మాజీ భార్యతో విడాకుల వ్యవహారం ఇంకా న్యాయస్థానంలో నడుస్తోందని వివరించారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతానని వెల్లడించారు. కాగా, తాజాగా విడుదలైన పెళ్లి సందD సినిమాలో శ్రీలీల సహస్ర పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

- Advertisement -