- Advertisement -
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ & కార్పోరేషన్ సమన్వయ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం కంటెస్టెడ్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ లు హాజరయ్యారు.
ఈసమావేశంలో జిల్లాలో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ల , జూనియర్లకు ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ముందే తీవ్ర పదజాలంతో ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. సీనియర్లను పట్టించుకోకుండా ఇప్పుడే వచ్చిన జూనియర్లకు టిక్కెట్ ఎలా ఇస్తారు అని విజయ రమణారావు , జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య వర్గం మధ్య వాగ్వాదం జరిగింది.
- Advertisement -