పెద్ద నోట్లతో పేదలే నష్టపోయారు..హరీశ్

23
- Advertisement -

పెద్దనోట్ల రద్దుతో దేశంలోని సామాన్యప్రజలే నష్టపోయారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీని వల్ల దేశానికి రూ.5లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు దాని పర్యవసనాలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని , దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ…పెద్ద నోట్ల రద్దు విఫలమైందని కేంద్రమే ఒప్పుకుందని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలు వాడే నగదు తక్కువ. కానీ ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదు రెట్టింపు అయిందని దీంతో దొంగనోట్ల సంఖ్య 54శాతం పెరిగినట్లు ఆర్‌బీఐనే చేప్పిందని మంత్రి అన్నారు. 2014కి ముందు దేశ జీడీపీలో 11శాతం నగదు ఉండగా ప్రస్తుతం దేశ జీడీపీలో 13శాతానికి పెరిగిందన్నారు. దేశంలో నల్లదనం అవినీతి పెరిగినట్లు తెలుస్తుందని హరీశ్‌రావు తెలిపారు.

బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల, అక్రమరవాణా, టెర్రరిజం పెరిగిపోయిందని…కేంద్రం చెప్పిన డీమానిటైజేషన్ లక్ష్యాలు నెరవేరలేదన్నారు. పెద్దనోట్ల మార్పు కోసం క్యూలైన్‌లో నిలబడి 108మంది చనిపోయారు. బీజేపీ తొమ్మిందేండ్ల పాలనలో వంద లక్షల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి…

భవిష్యత్ బీఆర్ఎస్‌దే..

ఏపీలో నవరత్నాల పాలన..

నిద్రలేమి సమస్య…అయితే!

- Advertisement -