ప్చ్.. మనోజ్ ఇలా.. విష్ణు అలా

25
- Advertisement -

మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్ మనిషి సారధి ఇంటికి వెళ్లి గొడవ పడిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పైగా ఈ వీడియోను షూట్ చేసింది మనోజే. ఈ క్రమంలో మనోజ్‌ నెట్టింట ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసీచూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే’ అని ఓ కోట్‌ షేర్‌ చేశాడు. ఈ అంశం పై మనోజ్ ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మరోవైపు మంచు విష్ణు కూడా ఇదే అంశం పై మరోలా మాట్లాడాడు. ఈ ఘటన మొన్న ఉదయం జరిగిందని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని స్పష్టం చేశారు. మనోజ్ చిన్నవాడని ఎదో కోపంలో వీడియో పోస్టు చేసి ఉంటాడని దీన్ని పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని సారథి తనతో వాగ్వివాదం పెట్టుకుంటే మనోజ్ అపలేకపోయాడన్నారు.

మొత్తానికి మంచు విష్ణు, మనోజ్ ల మధ్య ఇంకా వ్యవహారం చక్కబడలేదు. మోహన్ బాబు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఆస్తుల పంపకాల్లో మంచు మనోజ్ కి అన్యాయం జరిగిందని టాక్ ఉంది. ఇప్పుడు మోహన్ బాబు ఆస్తులను కూడా అందరికీ సమానంగా పంచాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాపారాలు అన్నీ విష్ణునే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంచు మనోజ్ కూడా వ్యాపారాల్లో అధికారం కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

OTT:ఓటీటీ : ఈ వీక్ కంటెంట్ ఇదే

RRR:నా వల్లే ఆస్కార్ వచ్చింది..అజయ్‌

chiranjeevi:రంగమార్తాండ..భావోద్వేగానికి గురయ్యా:చిరంజీవి.!

- Advertisement -