మొబైల్ రిచార్జ్, రెస్టారెంట్ బిల్, ఫ్లైట్ టిక్కెట్ ఇలా, ఎన్నో వాటికి క్షణాల్లో పేమెంట్ కట్టేయండంటూ..చాలా యాప్‌లే అందుబాటులో ఉన్నాయి.
ఇలా వచ్చిందే పేటిఎం కూడా. అయితే రీఛార్జీ యాప్‌గా అడుగుపెట్టి షాపింగ్ స్టోర్, పేమెంట్ బ్యాంక్‌గా ఎదిగిన పేటీఎం ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్ లో వంద మిలియన్ల డౌన్‌లోడ్లు సంపాదించిన మొదటి పేమెంట్ యాప్‌గా పేటీఎం నిలిచింది.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ పేటీఎం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా డిసెంబర్ రెండో వారంలోనే తాము ఈ ఘనత సాధించినట్లు ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ పేటీఎం ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. వారు చేసిన కృషి వల్లే ఇవాళ ఈ ఘనత సాధించగలిగామని ఆయన అన్నారు. ఈ రికార్డును ఆదర్శంగా తీసుకుని మున్ముందు వినియోగదారులకు మంచి సేవలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.