‘అదిరింది’ డైరెక్టర్‌తో అఖిల్‌..?

240
Akhil eyes Atlee for a blockbuster ?
- Advertisement -

అఖిల్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హలో’ సినిమా యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే అక్కినేని అభిమానులు ఈ సినిమా విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. అఖిల్ మూడవ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన 3వ సినిమాకి సంబంధించిన వివరాలను జనవరి 10న వెల్లడిస్తానని అఖిల్ చెప్పాడు.

Akhil eyes Atlee for a blockbuster ?

అఖిల్ చేయనున్న దర్శకుల జాబితాలో కొరటాల .. బోయపాటి .. సుకుమార్ ఉండగా, తాజాగా ‘మెర్సల్’ దర్శకుడు అట్లీ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. అట్లీకుమార్ ఇటీవల చేసిన ‘మెర్సెల్’ వసూళ్ల పరంగా ఎంతగా దుమ్ము రేపేసిందో తెలిసిందే. ‘హలో’ సినిమాతో యూత్ కి చేరువైన అఖిల్ ను .. తదుపరి సినిమాతో మాస్ ఆడియన్స్ కి దగ్గర చేయాలనే ఉద్దేశంతో నాగ్ వున్నాడట. అందువలన ఆయన అట్లీ కుమార్ పై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ దర్శకుడు ప్రభాస్ తో కలవనున్నాడు అని కొన్ని రోజుల వరకు కోలీవుడ్ – టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. దీంతో అట్లీ అఖిల్ తోనే ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావల్సింది.

- Advertisement -