పేటిఎంకు షాకిచ్చిన గూగుల్!

208
paytm

పేటిఎంకు షాకిచ్చింది గూగుల్‌. గ్యాంబ్లింగ్ గైడ్ లైన్స్‌ను ఉల్లంఘించడంతో గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను తొలగించింది.ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ తొలగించడంపై పేటీఎం ట్విటర్లో స్పందించింది. కొత్త డౌన్‌లోడ్‌లు లేదా అప్‌డేట్‌ కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ తాత్కాలికంగా అందుబాటులో లేదు. త్వరలోనే యాప్‌ మళ్లీ ప్లే స్టోర్‌లోకి వస్తుందన్నారు.

ఎప్పటిలాగే మీ పేటీఎం యాప్‌ను ఉపయోగించుకోవచ్చు…. యూజర్ల సొమ్ము అంతా పూర్తిగా సురక్షితం అని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్‌ పాలసీలను పేటీఎం పదేపదే ఉల్లంఘించిందని ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి వినియోగదారులకు పేటీఎం యాప్‌ అనుమతిస్తోందని ఇది స్టోర్ట్స్‌ బెట్టింగ్‌కు పాల్పడేందుకు కూడా సహకరిస్తుందని అందుకే తొలగించామని గూగుల్ తెలిపింది.