తెలుగు ఖ్యాతికి ఘననివాళి

18
- Advertisement -

నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది. గర్వంతో ఛాతీ పైకిలేస్తుంది. సినీ, రాజకీయ రంగాల్లోనూ తెలుగునాట ఎన్టీఆర్ స్థాయిలో చరిత్ర సృష్టించిన వారు మరొకరు లేరు. అందుకే ఎన్టీఆర్ పై నేటికీ ప్రజల్లో అమితమైన అభిమానం గౌరవం ఉన్నాయి. ఇక ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా హైదరబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈరోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ లు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.

అంతకుముందు లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నందమూరి తారకమారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు బాలకృష్ణ కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి తెలుగువాడికి రాజకీయం తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని, ఎన్టీఆర్ తరువాత నాయకులందరూ ఆయనను అనుసరిస్తున్నారని బాలయ్య చెప్పారు.

నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఎమోషనల్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని.. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ తెలుగు వారి గుండె చప్పుడుని స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాము. జోహార్ ఎన్టీఆర్ అంటూ నీరాజనాలు పలుకుతున్నారు. అలాగే, తెలుగు అనే పదానికి కీర్తి, ప్రతి తెలుగు వాడికి స్ఫూర్తి, నందమూరి అభిమానుల గుండె చప్పుడు అయిన అన్న నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -