పవన్ భార్య రిక్వెస్ట్ కాదంటారా..!

448
Pawans wife request to media
Pawans wife request to media
- Advertisement -

పవన్ కల్యాణ్ ఆయన భార్య అన్న లెజినోవాకు చాలా విషయాల్లో పోలికలున్నాయి. అఫ్ కోర్స్.. ఆ కారణంగానే పవన్, అన్నాను పెళ్లిచేసుకున్నాడు. అయితే.. పెళ్లి తరువాత అన్నా లెజినోవా కుటుంబానికే పరిమితమైంది. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తప్పా.. బయటి ఫంక్షన్లతో ఆమె కనిపించిందిలేదు. అయితే తాజాగా మంచు ఫ్యామిలీ ఇచ్చిన ఓ పార్టీకి అన్నా హాజరైంది. ఈ సందర్భంగా మీడియా వర్గాలు తీసిన ఫోటోలను ఆమె డిలేట్ చేయించిదని న్యూస్. ఇంతకీ పవన్ భార్య అలా ఎందుకు చేసింది.

Pawan-Kalyan-Anna-Lezhneva-Daughter

పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్న లెజినోవా ఇద్దరు సామాన్య జీవితం గడపడానికే ఇష్టపడుతుంటారు. రీసెంట్ గా జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణ. రీసెంట్ గా అన్న లెజినోవా మంచు ఫ్యామిలీ తన ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌లో ఇచ్చిన హాలోవీన్‌ పార్టీకి హాజరైంది. అన్నా బయటి ఫంక్షన్లకు హాజరవ్వడం అదే తొలిసారి కావడంతో అందరి కన్నూ ఆమెపైనే పడింది. దీంతో మీడియా అంతా ఒక్కసారిగా ఆమెను ఫోకస్ చేసింది. అన్నా లెజినోవా కనిపించడమే ఆలస్యం కెమెరాలతో ఆమెను షూట్ చేశారట. ఫోటోలు వద్దంటూ ఆమె వారించినా మీడియా వర్గాలు మాట వినలేదట. దీంతో తనకు సంబంధించిన ఏ ఫోటోనూ పబ్లిష్ చేయవద్దని అన్నా మీడియాను కోరినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ లా అన్నా కూడా సామాన్యంగా ఉండేందుకే ఇష్టపడుతుంది. అంతటి సెలబ్రిటీ సున్నితంగా రిక్వెస్ట్ చేయడంతో ఆమె ఫోటోలను ఫోటో గ్రాఫర్లు డిలీట్ చేశారట. అయితే ఎవరో కొందరు స్టూడెంట్లు మాత్రం అన్నా ఫోటోలను డిలీట్‌ చేయకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన వారంతా అన్నా లెజినోవాలో సింప్లీసిటీని చూసి తెగపొగిడేస్తున్నారు కూడా.

- Advertisement -