మళ్ళీ తండ్రి కాబోతున్న పవర్ స్టార్?

278
Pawan becomes father again
- Advertisement -

పవన్ కళ్యాణ్ సినీ జీవితం గురించిన విషయాలు ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో ఆయన వ్యక్తిగత జీవితం,రాజకీయాలకు గురించిన అంశాలూ అంతే ట్రెండింగ్ అవుతాయి. తాజాగా, ఆయనకు సంబంధించిన మరొక షాకింగ్ గాసిప్ ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడన్న వార్త టీ టౌన్‌లో హల్‌ చల్ చేస్తోంది.

Pawan becomes father again
రష్యాకు చెందిన అన్నా లెజీనావోని మూడో పెళ్ళి చేసుకున్న పవన్‌కి పొలేనా అనే పాప ఉంది. అయితే రీ సెంట్‌గా అన్నా ఓ షాపింగ్‌ మాల్‌లో బేబి బంప్‌తో కనిపించిందని,దీంతో పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

తొలుత ఇండస్ట్రీకి సంబంధంలేని అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ రేణు దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత రేణు నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇటీవల తన కుమార్తె ఆద్య(రేణు దేశాయ్ కూతురు) పుట్టిన రోజు వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఆద్య స్కూల్లో ఈ బర్త్ డేను నిర్వహించ‌గా చిన్నారులతో కలసి పవన్ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పిల్లల పుట్టన రోజున కాస్త సమయాన్ని కేటాయించడమే… పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే నిజమైన బహుమతి అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -