సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రష్మిక మందన్నా హవా నడుస్తోంది. ఆమె క్రేజీ పోస్టులకు సోషల్ మీడియా సైతం షేక్ అయిపోతుంది. పైగా రష్మిక మందన్నా లాంటి క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ మంది ఉన్నారు. అందుకే.. ఇప్పుడు అందరికీ రష్మిక మందన్నానే కావాలి. దీనికితోడు రష్మిక మందన్నా సెంటిమెంట్ అయిపోయింది. అన్నిటికీ మించి యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ రష్మిక మందన్నా అంటే చాలా ఇది అయిపోయింది. దీనికితోడు తమ సినిమాల్లో రష్మిక మందన్నా ఉంటే చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు దర్శకులు.
అందుకే ప్రభాస్ సినిమా కోసం దర్శకుడు మారుతి కూడా ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక మందన్నాను ట్రై చేస్తున్నాడు. మరోపక్క ఆల్ రెడీ బన్నీతో రష్మిక మందన్నా పుష్ప 2 సినిమా చేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా మొదట పూజాహెగ్డేను తీసుకొవాలని దర్శకుడు హరీశ్ శంకర్ భావించాడు. కానీ, పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉంది. పైగా రెమ్యునరేషన్ పరంగా కూడా డిమాండ్ చేస్తోంది.
ఇక పూజా తర్వాత టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తర్వాత పేరు రష్మిక మందన్నాదే. అందుకే, రష్మిక మందన్నా కోసం మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్నాను పవన్ సినిమా కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు హరీష్ శంకర్. ఐతే, పవన్ సినిమాలో రష్మిక మందన్నాను తీసుకోవడానికి కొన్ని అడ్డంకులున్నాయి. ముఖ్యంగా కాల్షీట్ల సమస్య. రష్మిక మందన్నా మరో రెండేళ్ల వరకూ ఫుల్ బిజీ. మరి పవన్ తో సినిమా అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ?, షూట్ కి ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలియదు. కాబట్టి, రష్మిక మందన్నా లాంటి బిజీ హీరోయిన్ ను తీసుకోవడం వృధా. మరి హరీష్ శంకర్ ఎన్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి…