ఒక్క ప్లాప్ మరెన్నో ప్రశ్నలు

172
- Advertisement -

విజయ్ దేవరకొండ… తెలుగు యువతకు బాగా కనెక్టయిన నటుడు. నో డౌట్, మంచి నటుడే.. కానీ బడాయి ఎక్కువ. చేసింది కొన్ని సినిమాలే, కాకపోతే స్టార్ హీరో అనే ఆటిట్యూడ్ తల నిండా ఎక్కేసింది. కరెక్ట్ గా ఇలాంటి సమయంలోనే వచ్చింది లైగర్. ఈ సినిమా ప్లాప్ దెబ్బకు విజయ్ దేవరకొండ ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా తీవ్రంగా, అలాగే మానసికంగా ఆవేదనకు గురి అవుతున్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ రేసులో అడ్డంగా పడిపోయాడు. మరి మళ్లీ లేవాలి. నిజానికి లైగర్ తో అటు హిందీలో కూడా భారీ హిట్ కొట్టాలని తెగ ఉబలాట పడ్డాడు.

కానీ, హిందీ ప్రేక్షకుడు తలుపులు మూసేసి, ఫోఫోవోయ్ అన్నారు. అడ్డదిడ్డంగా ఏదో కథ రాసేసి.. నాలుగు ఫైట్లు, ఐదు డైలాగ్ లు పెడితే జనం హిట్ చేయడానికి రెడీగా లేరని విజయ్ దేవరకొండకి క్లారిటీ వచ్చింది. అందుకే, ప్రస్తుతం కథ..కథ.. మంచి కథ కావాలి అంటూ కిందామీదా పడుతున్నాడు. వాస్తవానికి విజయ్ దేవరకొండకు నిర్మాతలు చాలా మంది వున్నారు. అలాగే చుట్టూ తిరుగుతున్న డైరక్టర్లు కూడా వున్నారు. కానీ విజయ్ కి ముందు కథ నచ్చాలి. నచ్చాలి అనేకంటే.. తన చుట్టూ ఉన్న వారందరూ కథకు జేజేలు కొట్టాలి.

మరి ఏ కథ అందర్నీ మెప్పించదు కదా. అందుకే, ఇప్పటి వరకు ఏ ఒక్కరి కథ విజయ్ దేవరకొండకు కనెక్ట్ కాలేదు. ఒక్క గౌతమ్ తిన్ననూరి కథ మాత్రమే పర్వాలేదు అనిపించింది. అది ఇంకా ఏమైంది అన్నది తెలియలేదు. మిగిలిన వారెవ్వరీ కథ నచ్చలేదు. అన్నింటికి మించి అసలు ఇప్పుడు తాను ఏ తరహా సినిమా చేయాలి అన్న క్లారిటీ కూడా విజయ్ దేవరకొండకు లేదు. మొత్తానికి ఒక్క ప్లాప్ మరెన్నో ప్రశ్నలు మిగిల్చింది.

ఇవి కూడా చదవండి…

నువ్వే నా ప్రాణం! ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

బాలయ్య ఈవెంట్‌కు ప‌వ‌న్?

అన్‌స్టాపబుల్ టీజర్ లాంచ్…నాగార్జున

- Advertisement -